తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 3 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు రైతులు ఆందోళన చేపట్టారు ఈ క్రమంలో రైతులు సహకార సంఘం సిబ్బందిని ఆఫీసులో ఉంచి తాళాలు వేశారు. ఒక్కో రైతుకు కనీసం మూడు కట్టలు యూరియా ఇవ్వాలని ఒక రైతుకి ఒక కట్ట యూరియా ఇస్తే ఎలా సరిపోతుందని సిబ్బంది ని నిర్బంధించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సహకార సంఘం దగ్గరకు వచ్చి సెటర్ ఓపెన్ చేసి రైతులను సమన్వయం పాటించవలసిందిగా కోరారు. ఈ విషయంపై స్పందిస్తూ సహకార సంఘం అధికారులు మన సొసైటీ పరిధిలోని 40 టన్నుల యూరియా అవసరమని ఆర్డర్ పెట్టగా పది టన్నుల యూరియానే వచ్చిందని ఉన్నవరకు ఇచ్చి మిగతా వారికి మళ్లీ రాగానే ఇస్తామని చెప్పారు
Admin
తెలుగు వెలుగు టీవీ