Tuesday, 21 April 2026 07:31:29 PM
# స్పష్టమైన ప్రణాళికతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి. # మహిళలకు శుభవార్త అందించిన సర్పంచ్ ఇస్లావ త్ రుక్మిణి. # ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలి – ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. # అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె.

ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలి – ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి.

Date : 20 April 2026 06:33 PM Views : 41

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం కింద చేపడుతున్న మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాదు నుండి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ 95 శాతానికి పైగా పూర్తయిందని, తెలంగాణలో కూడా అదే స్థాయిలో పురోగతిసాధించేందుకు.సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈఆర్ఓలు, ఏఈఆర్వోలు తమ పరిధిలోని బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓలు), సూపర్వైజర్లకు స్పష్టమైన దిశానిర్దేశం అందిస్తూ క్షేత్రస్థాయిలో పనులను క్రమబద్ధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల ఏజెంట్ల నియామకంపై ఇప్పటికే ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినందున, వారి సహకారాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పరిధిలోని బిఎల్ఓలతో సమన్వయం పెంచుకుని మ్యాపింగ్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించేందుకు ముందుకు రావడం ద్వారా మిగిలిన ప్రాంతాల్లో పనులను వేగంగా పూర్తి చేయవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, ఇతర జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో మ్యాపింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బిఎల్ఓలు, సూపర్వైజర్ల సమన్వయంతో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, వారం రోజుల్లో గణనీయమైన పురోగతి సాధించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతిరోజూ పురోగతిని సమీక్షిస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందజేస్తామని తెలిపారు . ఈ సమావేశంలో కొత్తగూడెం ఆర్టిఓ మధు, ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :