Monday, 20 April 2026 05:33:28 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

సింగరేణి జాబ్ మేళాలతో 23,650 మందికి ఉద్యోగాలు

Date : 28 October 2025 02:21 PM Views : 425

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విజయవంతంగా మెగా జాబ్ మేళా కార్యక్రమాలు ప్రభుత్వ చొరవకు యువత హర్షం ప్రభుత్వ సంకల్పం – సింగరేణి సౌజన్యంతో ఘనంగా ఏర్పాట్లు ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 7 పట్టణాల్లో భారీ జాబ్ మేళా కార్యక్రమాలు పాల్గొన్న 66,965 మంది నిరుద్యోగ యువత ఒక ఉత్సవంగా, ఉత్సాహంగా కొనసాగుతున్న జాబ్ మేళాలు సింగరేణి భవన్, అక్టోబర్ 28, 2025 ఉద్యోగం — ప్రతీ నిరుద్యోగి స్వప్నం! తగిన విద్యార్హతలు ఉన్నా, హైదరాబాద్ నగరంలో కంపెనీల చుట్టూ తిరిగినా ఉద్యోగం లభిస్తుందన్న హామీ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో, పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల యువత ముంగిటకే హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీలను తీసుకువచ్చి, వారి అర్హతలకు తగిన ఉద్యోగాలను ఎంచుకునే అరుదైన అవకాశాన్ని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కల్పిస్తోంది. నిరుద్యోగుల ముఖాలపై వెలుగులు నింపుతూ, సింగరేణి గత ఆరు నెలలుగా మెగా ఉద్యోగ మేళాల రూపంలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్విరామంగా కొనసాగిస్తోంది. దాదాపు24 వేల మంది యువతకు కొలువులను కల్పించి వారిలో నూతన ఉత్సాహం నింపింది.

రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి సింగరేణి చిరు తోడ్పాటు.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పం... మెగా జాబ్ మేళా కార్యక్రమాల నిర్వహణ ద్వారా కార్యరూపం దాల్చి విజయవంతంగా నడుస్తోంది. రాష్ట్ర ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆలోచనలతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో గత ఆరు నెలల కాలంలో 7 పట్టణాలలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాలలో 66,965 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా, వీరిలో 23,650 మందికి ఉద్యోగాలు లభించడం విశేషం. ఇంత భారీ ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించడం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడం బహుశా ఇదే ప్రథమం. ఏడవ తరగతి మొదలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలు గల వారితో పాటు, టెక్నికల్, మెడికల్, పారామెడికల్ తదితర అన్ని విద్యార్హతలు గల వారికి ఇక్కడ తమ అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఎంచుకునే అవకాశం దక్కింది. హైదరాబాద్ ప్రాంతం నుండి ఒక్కొక్క జాబ్ మేళా కార్యక్రమంలో 100 నుండి 250 వరకు పలు ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. మైకుల ద్వారా, పోస్టర్ల ద్వారా, కరపత్రాల ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించడంతో ఈ జాబ్ మేళా కార్యక్రమాలు మారుమూల గ్రామాలు, పట్టణాల్లో ఉన్న యువతను విశేషంగా ఆకర్షించాయి. యువతీ యువకులు వేలాదిగా తరలి రావడంతో పట్టణ ప్రాంతాలు ఒక ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారని జాబ్ మేళాలో పాల్గొన్న నిరుద్యోగ యువత, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల చొరవతో భారీగా విజయవంతం. ఈ జాబ్ మేళా కార్యక్రమాలను సంబంధిత ఏరియాల మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దీంతో ఈ కార్యక్రమాల నిర్వహణ గురించి ప్రతీ గ్రామంలో విస్తృత ప్రచారం జరిగింది. వారు విస్తృతంగా నిర్వహించిన ప్రచారం వల్ల పెద్ద సంఖ్యలో యువత ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ జాబ్ మేళా కార్యక్రమాలను ఏప్రిల్ 21వ తేదీన మధిర నుంచి ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు సారథ్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 5,000 మంది పాల్గొనగా 2,300 మందికి ఉద్యోగాలు లభించాయి. అదే నెల 27వ తేదీన భూపాలపల్లిలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సారథ్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 3,500 మంది పాల్గొనగా 2,000 మందికి ఉద్యోగాలు లభించాయి. మే 18వ తేదీన గోదావరిఖనిలో నిర్వహించిన జాబ్ మేళాలో 5,100 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా 3,029 మందికి ఉద్యోగాలు లభించాయి. స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు, సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. బలరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 24వ తేదీన వైరా పట్టణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో భారీగా నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో 12,000 మందికి పైగా పాల్గొనగా 4,041 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, తదితరులు పాల్గొన్నారు. కాగా అక్టోబర్ 25వ తేదీన రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో హుజూర్ నగర్ లో నిర్వహించిన అతి పెద్ద జాబ్ మేళా కార్యక్రమంలో 20,500 మంది యువత పాల్గొన్నారు. వీరిలో 4,574 మందికి ఉద్యోగాలు లభించాయి. అలాగే 26 వ తేదీ ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మొత్తం 14,318 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా వీరిలో 4,611 మందికి ఉద్యోగాలు లభించాయి. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి రాగమయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అదే రోజు బెల్లంపల్లిలో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 6,547 మందికి పైగా నిరుద్యోగ యువత ఈ కార్యక్రమానికి తరలివచ్చారు కాగా 3,095 మందికి ఇక్కడ ఉద్యోగాలు లభించాయి. సింగరేణి ఏర్పాట్లపై సర్వత్రా హర్షం … సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా ఈ భారీ మెగా జాబ్ మేళా కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందించింది. స్టాల్స్ ఏర్పాటు, ప్రచారం, భోజనం, హైదరాబాద్ నుంచి విచ్చేసిన ప్రైవేటు కంపెనీల ప్రతినిధులకు సౌకర్యాలు, మంచినీటి వసతి, సింగరేణి అధికారులు ,ఉద్యోగులు, సింగరేణి సెక్యూరిటీ మరియు రెస్క్యూ విభాగం వారి సేవలను ప్రజా ప్రతినిధులు, హాజరైన నిరుద్యోగ యువత ప్రత్యేకించి కొనియాడారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో కూడా సింగరేణి ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో నిర్వహించే సామాజిక బాధ్యత కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని సంస్థ చైర్మన్ మరియు ఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. ప్రత్యేకంగా ఉద్యోగ మేళాలకు సంస్థ సంపూర్ణ సహకారం అందించనుందని, ఈ ద్వారా స్థానిక యువతకు, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి సింగరేణి తన వంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో మెగా ఉద్యోగ మేళాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :