తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు గ్రామానికి చెందిన రజాక్ ఇంట్లోకి తాచుపాము చేరి కలకలం సృష్టించింది. గత కొన్ని రోజులుగా ఇంట్లో పెంచుకుంటున్న కోళ్లను ఈ పాము కాటు వేసి చంపుతోంది. సోమవారం ఉదయం కోళ్ల శబ్దం విని యజమాని గమనించగా, పాము బుసలు కొడుతూ కనిపించింది. కొత్తగూడెం స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్కు సమాచారం ఇవ్వగా, ఆయన అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ