తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని పోలీస్ సిబ్బందికి గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న టి ఏ లు ,డిఏలు ,సరెండర్ లీవ్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మెమొంటోను అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు, ఎస్బిసిఐ శ్రీనివాసరావు,వైస్ ప్రెసిడెంట్ ఏసోబు, జాయింట్ సెక్రెటరీ జానీ మియా, ట్రెజరర్ కె వెంకటేశ్వరరావు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ