తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ రైల్వేలో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ది పనులు చేపట్టడం ద్వారా గొప్ప పరివర్తన దిశగా పురోగమిస్తుంది. " అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్" (ఏ.బి.ఎస్.ఎస్.) కింద, తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్‌లను రూ. 2,737 కోట్ల అంచనా వ్యయంతో, ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను అందించడానికి మరియు వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి పునరాభివృద్దిచేయబడుతున్నాయి. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆగస్టు 2023 మరియు ఫిబ్రవరి, 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడంతో ఈ పధకానికి మరింత ప్రోత్సాహం లభించింది.
ఈ స్టేషన్ ప్రముఖంగా భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి ప్రవేశ ద్వారంగా ఉంటూ ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ స్టేషన్ భద్రాచలం ఆలయ పట్టణానికి సమీపంలో ఉండటం వలన భక్తులు మరియు ప్రయాణికులకు ఇది ఎంతో అనువుగా ఉంది. ఇటీవలి సంవత్సరాలలో, ఈ స్టేషన్ గణనీయంగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలో భాగంగా విద్యుదీకరణ మరియు భద్రాచలం రోడ్ - సత్తుపల్లి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం ఉన్నాయి. ఈ కొత్త రైల్వే లైన్ ను దక్షిణ మధ్య రైల్వే మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. తద్వారా బొగ్గు రవాణాను సులభతరం చేయడం మరియు ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సుమారు రూ.25.41 కోట్ల అంచనా వ్యయంతో వెయిటింగ్ రూములు, ఎస్కలేటర్, లిఫ్ట్ మరియు మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలతో సహా ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలతో మరింత పునరాభివృద్ధి చేయబడుతూ ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్‌గా నిలువనుంది.
Admin
తెలుగు వెలుగు టీవీ