తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అశ్వారావుపేట లో సీపీఐ 3వ మహాసభలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. | జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి భారీ ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మహాసభలను ప్రారంభించగా, జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా ప్రతినిధులను ఉద్దేశించి పార్టీ లక్ష్యాలు, దిశానిర్దేశం పై ప్రసంగించారు. ఈ మహాసభలు జిల్లా స్థాయి నాయుకులు మరియు రాష్ట్ర స్థాయి నాయకులు.. పాల్గొన్నారు ముఖ్యంగా కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపి, పార్టీ బలోపేతానికి కీలక ఘట్టంగా నిలిచాయని నేతలు అభిప్రాయపడ్డారు. శ్రేణుల్లో పోరాట స్ఫూర్తిని పెంచేందుకు మహాసభలు ఉపయోగపడినట్లు పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ