Friday, 19 June 2026 04:17:47 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

అధిక ధరలను నిరసిస్తూ జూన్ 10న కలెక్టరేట్ ఎదుట ధర్నా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 03 June 2026 06:11 PM Views : 29

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అధిక ధరలను నిరసిస్తూ జూన్ 10న కలెక్టరేట్ ఎదుట ధర్నా. ధరల నియంత్రణలో కేంద్రం విఫలం.అడ్డు అదుపులేకుండా పెంచుతున్న ధరలపై ప్రజలు గళం విప్పాలి.ధరలను నియంత్రించేవరకు కేంద్రంపై పోరాటం ఆగదు.ప్రజల్లో మమేకమై స్థానిక సమస్యలను గుర్తించి రాజీలేని పోరాటాలు చేయాలి. ప్రజాసమస్యలు గుర్తించి పరిస్కారానికి కృషిచేయాల్సిన బాధ్యత కార్యకర్తలదే. ఎమ్మెల్యే కూనంనేని కృషితో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న నియోజకవర్గం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.దేశంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డి విరుస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల అడ్డు అదుపులేకుండా పెంచుతున్న ధరలపై ప్రజలు గళం విప్పాలని, అప్పుడే పాలకుల్లో చలనం వస్తుందని ఆయన పిలుపునిచ్చారు. పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ అధిక ధరలను నిరసిస్తూ జూన్ 10న చేపట్టబోయే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్న కేంద్రం తన వైఖరి మార్చుకుని ధరలను నియంత్రించేవరకు కేంద్రంపై పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ, నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో మమేకమై స్థానిక సమస్యలను గుర్తించి రాజీలేని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాసమస్యలు గుర్తించి వాటి పరిస్కారానికి నిరంతరం కృషిచేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని, ప్రజల పక్షాన నిలబడి పోరాడినప్పుడే పార్టీకి నిజమైన బలం చేకూరుతుందని గుర్తుచేశారు. మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషితో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న నియోజకవర్గంగా కొత్తగూడెం మారుతోందని, అనేక దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిస్కారంకావడం హర్షణీయమని అన్నారు. సమావేశంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, వాసిరెడ్డి మురళి, జిల్లా సమితి సభ్యులు నేరెళ్ల రమేష్, గొనె మని, మునిగడప వెంకటేశ్వర్లు, కొమారి హన్మంతరావు, పట్టణ నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ఎండి యూసుఫ్, బోయిన విజయ్ కుమార్, ముడెత్తుల శ్రీనివాస్, గోపి కృష్ణ, ధర్మరాజు, సుధాకర్, పల్నాటి ప్రశాంత్, పి ధనలక్ష్మి, వై శంకర్, జహీర్, నగేష్, సత్యనారాయణాచారి, సింగిరాల రమేష్, గడ్డం ప్రభాకర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :