తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నవంబర్ 8 నవభూమి ప్రతినిధి: పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా అజేయంగా నిలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు పునరుద్ఘాటించారు. సిపిఐ జిల్లా కార్యాలయం "శేషగిరిభవన్"లో శుక్రవారం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం పట్టణ పరిధిలోని వివిధ గ్రామాలు, బస్తీల నుంచి వివిధ పార్టీల్లో, ప్రజా సంఘాల్లో, సామాజిక సంఘాల్లో క్రియాశీలక పాత్రా పోషించిన సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తలు కూనంనేని సమక్షంలో సిపిఐలో చేరారు. వీరికి ఎర్ర కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ సిపిఐది వందేళ్ల చరిత్ర అని మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా ప్రజాక్షేత్రంలో మనగలుగుతామన్నారు. నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవలందించేందుకు పురుడుపోసుకున్న పార్టీకి ప్రతినిధులుగా పనిచేయడం అదృష్టంగా కార్యకర్తలు భావించాలన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐకి ఎదురులేదని, ఇది ప్రజలకు అందించిన సేవల ఫలితమేనన్నారు. ప్రజా సమస్యల పరిస్కారంకోసం, పార్టీ పటిష్ఠతకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, నియోజకవర్గ అభివృద్దే అంతిమ లక్షంగా శ్రమిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు చల్లా శకుంతల, చల్లా భాస్కర్, మోహనరావు, ఇమ్రాన్, జమాల్, తేజా, శశి, యాకూబ్ పాషా, జమీల్, బానోత్ పద్మ, వడ్లూరి రాజారామ్, రమాదేవి, వీరన్న, సురేష్, భావ్ సింగ్, బోడ శ్రీను, జబ్బర్ సింగ్, కొత్తూరు నారాయణ, కట్ట నాగయ్య, పులిచెర్ల విశ్వనాధం, సడియం వెంకన్న నేతృత్వంలో 500 కుటుంబాలు సిపిఐలో చేరాయి. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, భూక్యా దస్రు, జి వీరాస్వామి, వంగ వెంకట్, గెద్దాడు నగేష్, జక్కుల రాములు, ధనలక్ష్మి, కౌన్సిలర్లు యూసఫ్, ధర్మరాజు, బోయిన విజయ్ కుమార్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ