తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ సోమవారం భద్రాచలంలో భారీ సమరభేరి సభ నిర్వహించనున్నారు. ఈ సభకు మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఐదు గ్రామపంచాయతీల అంశంపై స్థానిక ప్రజల్లో అసంతృప్తి కొనసాగుతోంది. వాటిని తిరిగి తెలంగాణలో చేర్చాలని ప్రజలు, వివిధ సంఘాలు ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు జరిగే సమరభేరికి ఆమె హాజరవుతున్నారు భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు పాల్గొనాలని ఆయన తెలిపారు.ఈ సభలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. భద్రాచలం ప్రాంతంలో ఈ సభకు రాజకీయ ప్రాధాన్యం నెలకొంది.
Admin
తెలుగు వెలుగు టీవీ