తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ స్కూల్ విద్యార్థులకు అభ్యసన సామాగ్రి పంపిణీ రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనల మేరకు పట్టణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పాత కొత్తగూడెం తెలంగాణ స్కూల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు అందజేసి మాట్లాడారు. ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని తల్లిదండ్రులకు విద్య నేర్పే గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. బాగా చదువుకుని తెలంగాణ స్కూల్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి గొప్ప స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పలు అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రుక్మాంగదర్ బండారి, ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు హుస్సేన్, తోగరు రాజశేఖర్, ఖాజా భక్ష్, రామిళ్ళ మధు, మొయినుద్దీన్, రాసపల్లి శ్రీను, సిద్దు, అశోక్, పూర్ణచందర్, వెన్నెల, మధు, హ్యాపీ, నవనీత్, షణ్ముఖ, అమన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ