తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం సాయిరాం తండా గ్రామానికి చెందిన హలవత్ శ్రీను తండ్రి పేరు రాములు అనే అతను సుమారు రెండు క్వింటాళ్ల నల్లబెల్లాన్ని మరియు 40 కేజీల పటికిని తన ఇంటి ఆవరణలో డంపు చేసుకొని ఉండగా జూలూరుపాడు ఎస్.ఐ బాదావత్ రవి తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేసి నల్ల బెల్లం మరియు పటికను స్వాధీనం పరుచుకొని, ప్రభుత్వంచే నిషేధించబడిన సారాయి తయారీకి వాడే నల్ల బెల్లం మరియు పటికను తన ఇంటి ఆవరణలో నిలువ ఉంచిన హలావత్ శ్రీను పై కేసు నమోదు చేయనైనది. బెల్లం యొక్క విలువ 23,400 రూపాయలుగా మరియు పటిక యొక్క విలువ 1200 రూపాయలుగా ఉంటుందన్నారు. సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ సారాయి తయారీకి ఉపయోగించే ముడి సరుకును అమ్మిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ