తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు అశ్వాపురం మండలం తుమ్మల చెరువు వద్ద జరుగుతున్న డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డిడిఆర్ఎఫ్) శిక్షణ కార్యక్రమాన్ని మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి సోమవారం నాడు సందర్శించారు. శిక్షణా శిబిరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి అందుతున్న శిక్షణ తీరును పర్యవేక్షించారు. విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడంలో, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో డిడిఆర్ఎఫ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. శిక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో అశ్వాపురం సిఐ ఎల్లయ్య, మరియ పోలీస్ అధికారులు, డిడిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ