తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన సోబ్బని వెంకటేశ్వర్లు బ్రెయిన్ ట్యూమర్ కారణంగా అకాల మరణం చెందారు. సుబ్బని వెంకటేశ్వర్లు పార్థివదేహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పూలమాలవేసి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు తండ్రి సోబ్బని సూర్యం సిపిఐ పార్టీ లో చాలా కాలం నుండి పనిచేస్తున్నారని ఇలాంటి నిబద్ధతగల సూర్యం కుమారుడి మరణం చాలా బాధాకరమని ఆయన అన్నారు. వెంకటేశ్వర్లు కుటుంబానికి సిపిఐ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని వెంకటేశ్వర్లు భార్య పిల్లలను తల్లిదండ్రులను ధైర్యంగా ఉండాలని అధైర్య పడద్దని ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు ,మండల సహాయ కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, ఎల్లంకి మధు, సిరిపురం వెంకటేశ్వర్లు, గుడిమెట్ల సీతయ్య, చిమట ముత్తయ్య, బెజవాడ సీతయ్య, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ