తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి మానవుడు కేవలం సైన్స్ పైనే ఆధారపడి జీవితాన్ని గడుపుతున్న కారణంగా అశాంతికి గురి అవుతున్నారు సైన్స్ తో పాటుగా ఆధ్యాత్మిక చింతన, ధ్యానము అలవర్చుకోవాలి అప్పుడు శాంతి యుత జీవితము గడుపుతారు అని సింగరేణి డైరెక్టర్ E&M సత్యనారాయణ ఇంజినీర్స్ డే సందర్భంగా బ్రహ్మా కుమారీస్ ఏర్పాటు చేసిన సెమినార్ లో తెలియజేసారు.
.ఈ కార్యక్రమంలో ఇర్రిగేషన్ డిపార్ట్మెంట్ నుండి E E రాంప్రసాద్, సింగరేణి IT GM రాంకుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమము అనంతరం బ్రహ్మా కుమారీస్ కార్యక్రమంలో పాల్గొన్న ఇంజినీర్స్ అందరిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమము బ్రహ్మా కుమారీస్ కొత్తగూడెం శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు అని బ్రాంచ్ ఇంచార్జి BK మహేశ్వరి తెలియజేసారు.
Admin
తెలుగు వెలుగు టీవీ