తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దాన్ ఫౌండేషన్ మరియు ITC-MSK వారి ఆధ్వర్యం లో జీవ వైవిద్య అభివృద్ధి కార్యక్రమం లో భాగంగా చెరువు కట్టల పైన , పల్లె ప్రకృతి వనం లో, క్రీడా ప్రాంగణం మొక్కలు నాటే కార్యక్రమము ని ఈరోజు గొపతండా గ్రామము, జులూరుపాడు మండలం నందు గల చెరువు కట్ట పైన మరియు పల్లె ప్రకృతి వనం నందు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ మాట్లాడుతూ పర్యావరణం కి మొక్కలు నాటడం చాలా ముఖ్యం, మొక్కలు ప్రతి ఒక్కరు నాటడం బాధ్యత గా తీసుకొని పర్యావరణాన్ని రక్షించాలి అని చెప్పారు అలాగే MPDO మాట్లాడుతూ ప్రతి పంచాయతీ లోని నర్సరీ లో మొక్కలు అందుబాటులో ఉన్నాయ్ వాటిని తప్పకుండా ఉపయోగించుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమం కు జులూరుపాడు MPDO కరుణాకర్ రెడ్డి , డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ రుక్మిణి దేవి , జులూరుపాడు MPO తులసిరామ్ , పంచాయతీ కార్యదర్శి లక్ష్మి నర్సయ్య , వయలగ కమిటీ సభ్యలు, దాన్ ఫౌండేషన్ సిబ్బంది సురేష్, స్వరాజ్ హాజరు కావడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ