తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వ్యాప్తంగా గల ఆలయాల్లో శుక్రవారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి హాజరై శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకను తిలకించారు. ఆలయ అర్చకుల ఆశీర్వాదం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముందుగా కొత్తగూడెం టౌన్ సఫాయిబస్తీలో మాదాసు పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీతారాముల కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం గౌతంపూర్ రామాలయం, గాజులరాజం బస్తీ టవర్స్ ఏరియా, భజన మందిరం దగ్గర గల పద్మశాలీ భవనంలో ప్రసాద్ ఇమంది గణేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకకు, రామవరం శివాలయంలో జరిగిన సీతారాముల కల్యాణ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రుక్మాంగదర్ బండారి, వేముల ప్రసాద్ బాబు, తారక్, గణేష్, కొండ్రు శేఖర్, ఇమాంది ఉదయ్ కుమార్, మాదాసు పద్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ