Friday, 19 June 2026 05:53:47 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం ఫలించిన కూనంనేని కృషి హర్షం వ్యక్తం చేస్తున్న కొత్తగూడెం ప్రజలు

Date : 24 March 2025 08:41 PM Views : 2242

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీతోపాటు సుజాతనగర్ మండల పరిధిలోని ఏడు గ్రామపంచాయతీలు కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రెవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఈమేరకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. కార్పొరేషన్ ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలపడంతో కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఆనందం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్కకు, జిల్లా ఇంచార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పటిల్కు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఆమోదం లభించడంతో గవర్నర్ ఆమోదంతో త్వరలో గెజిట్ విడుదల కానుంది. ఈ సందర్బంగా ఎంఎల్ఏ కూనంనేని మాట్లాడుతూ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే కార్పోరేషన్ ఏర్పాటు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసి సాధించానని, కొద్ది రోజుల్లోనే కొత్తగూడెం ప్రాంతం నగరాలకు తీసిపోని విధంగా అన్ని రంగాల్లో అవృద్ది సాధిస్తుందని తెలిపారు. కార్పోరేషన్ ఏర్పాటు వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ప్రజల ఆస్తులకు సరైన విలువ పెరుగుతుందన్నారు. ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ది సాధిస్తున్న కొత్తగూడెం ప్రాంతం మరిన్ని పరిశ్రమల ఏర్పాటు దారులు ఏర్పడతాయని తద్వారా ఉద్యోగ, ఉపాది అవకాశాలు మెరుగుపడతాయని, జిల్లాలో విస్తారంగా ఉన్న బొగ్గు, విద్యుత్, అటవీ, ఖనిజ సంపద ఆదారిత పరిశ్రమల ఏర్పాటు వేగవంతం కానుందన్నారు. ఎప్పటినుంచో నిలిచిపోయిన పాల్వంచ ఎన్నికలకు అడ్డంకులు తొలిగిపోయాయని తెలిపారు. గెలిసిన 15 నెలల కాలంలోనే కార్పొరేషన్ సాధించి నియోజకవర్గ ప్రజలకు గెలుపు ఫలాలు అందించడం పట్ల అన్నివర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. కార్పొరేషన్ ఏర్పాటుకు నిరంతరం కృషి చేసిన శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావుకు హృదయపూర్వక అభినందనలు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: