తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : సింగరేణి కార్మికులకు లాభాల్లో 35% వాటా ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శనివారం సీఎంను కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. లాభాల వాటా విషయంలో కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ