తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాదకద్రవ్యాల నివారణకు ప్రతి పౌరుడు కృషి చేయాలని కొత్తగూడెం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ముప్పారపు కరుణాకర్ అన్నారు. మాదకద్రవ్యాల నివారణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి షేక్ అబ్దుల్ రహమాన్ నేతృత్వంలో మంగళవారం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో విద్యార్థులు, యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై విజయ, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ