Friday, 19 June 2026 05:48:08 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

ఐడి ఓ సి కార్యాలయం మీటింగ్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో (దిశా) చైర్మన్ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్

Date : 19 October 2024 08:03 PM Views : 653

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐ డి ఓ సి కార్యాలయంలో శనివారం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రాం సహాయం రఘురాం రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన దిశ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు జనవరి మాసంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సమీక్ష సమావేశంలో గౌరవ శాసనసభ్యులు నియోజక వర్గాల వారీగా గ్రామాలలోని వివిధ సమస్యలను మహబూబాబాద్ ఖమ్మం గౌరవ ఎంపీల సమక్షంలో పరిష్కరించిన అంశాలను క్లుప్తంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ్ సహాయం రఘురామిరెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం మాట్లాడుతూ దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి పేద కుటుంబాలకు మరియు ఆదివాసి గిరిజన గ్రామాలలోని గిరిజన కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలు చేరే విధంగా సంబంధిత శాఖల అధికారులు బాధ్యతగా పనిచేసే అమలయ్యే విధంగా చూడాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే కాకుండా గిరిజన సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు బడ్జెట్ లో ఎక్కువ మొత్తం నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఎంత కష్టపడి పని చేసిన నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని అన్నారు. పేదరిక నిర్మూలన నిరక్షరాస్యత బాల్య వివాహాలు బాలల హక్కులు బాల కార్మిక వ్యవస్థలపై మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గాలలోని మారుమూల ప్రాంతాలలో కరెంటు సమస్య మంచినీటి సమస్య రోడ్ల సమస్య లేకుండా చూడాలని, అలాగే జిల్లా పరిషత్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మాతా శిశు కేంద్రాలలో అన్ని రకాల వసతి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని, జిల్లా కలెక్టర్ తో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తప్పనిసరిగా వారి పరిధిలోని అన్ని సెంటర్లను తనిఖీ చేస్తూ ఉండాలని ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే నిధులు నియోజకవర్గాల వారీగా సక్రమంగా వినియోగించడానికి జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీవో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శాసనసభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి నియోజకవర్గాలలో నెలకొన్న వివిధ సమస్యలను గుర్తించి నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. ముఖ్యంగా విద్య వైద్యం విద్యుత్ పబ్లిక్ హెల్త్ నేషనల్ హైవే రోడ్స్ కు సంబంధించిన శాఖలు ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు ప్రారంభించి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వచ్చే సమావేశానికి గౌరవ శాసనసభ్యులు నియోజకవర్గం వారిగా లేవనెత్తిన వివిధ అంశాల యొక్క సమస్యలను సంబంధిత అధికారులు సమస్యలు పరిష్కరించి పూర్తిస్థాయి అందజేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐటిడిఏ పిఓ రాహుల్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్,ఎమ్మెల్యేలు తేల్లం వెంకట్రావు,పాయం వెంకటేశ్వర్లు మాలోతి రామదాస్, జారే ఆదినారాయణ,దిశ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :