తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని తవ్వకంలో లభ్యమైన 110 లక్షల సంవత్సరాల నాటి స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాల అవశేషాలు, డైనోసార్ కాలానికి చెందిన శిలాజ కలపను పొందుపరుస్తూ బిర్లా సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సింగరేణి పెవిలియన్ ఈరోజు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ప్రారంభించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో 110 లక్షల సంవత్సరాల క్రితం సంచరించిన అనంతరం అంతరించిపోయిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగు అవశేషాలుగా శాస్త్రజ్ఞులు గుర్తించారని, చరిత్ర పూర్వ యుగానికి చెందిన ఈ అవశేషాలను ప్రజలు, విద్యార్థులు వీక్షించడానికి అనువుగా ప్రతిష్టాత్మకమైన బిర్లా సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ