Sunday, 19 April 2026 03:28:56 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 06 January 2026 06:07 PM Views : 244

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మున్సిపాలిటీ ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు, లిఖితపూర్వకంగా నిర్ణీత గడువులోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కోరారు. మంగళవారం ఐ డి ఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 01-10-2025 నాటికి ఓటరుగా నమోదు అయిన ప్రతి వ్యక్తిని ఎపిక్ కార్డులో పేర్కొన్న చిరునామా ఆధారంగా ఆయా డివిజన్‌లకు సంబంధించిన ఓటరు జాబితాలో చేర్చడం జరిగిందని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఈ నెల 9వ తేదీ వరకు స్వీకరించే అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించి, పరిష్కరించిన అనంతరం 10వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 106 వార్డులకు గాను 1,85,750 మంది ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటరు జాబితాను సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. ఈ జాబితాలో పేరు, చిరునామా, వార్డు, ఇతర వివరాల్లో ఏవైనా పొరపాట్లు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు వేర్వేరు వార్డుల్లో ఓట్లు నమోదై ఉండటంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు వార్డుల్లో నమోదు అయి ఉంటే, సంబంధిత దరఖాస్తుల ఆధారంగా వాటిని సరిచేసే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్, అశ్వరావుపేట మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సిపిఎం తులసీరామ్, బిజెపి నోముల రమేష్, సిపిఐ శ్రీనివాస్, జే ఎస్ పి సందీప్, ఐ ఎన్ సి లక్ష్మణ్ అగర్వాల్, టిడిపి కళ్యాణ లక్ష్మీపతి, బీఎస్పీ శంకరయ్య, ఏ ఏ పి రమేష్ తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగ అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :