తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం లో శ్రీనగర్ కాలనీ లో జరిగిన సమావేశం లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు పాల్వంచ పట్టణం లో చాల విలువైన ప్రభుత్వ భూములను కొందరు అమ్ముకుంటున్న స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. పాల్వంచ పట్టణం లో సుమారు వందల కోట్ల విలువైన 5,6 వందల ఎకరాల ప్రభుత్వ భూములు కేవలం రెవెన్యూ కార్యాలయం లో పేపర్ల మీద తప్ప బౌతికంగా లేవు అని అన్నారు గతం లో రెవెన్యూ శాఖ వారు ప్రభుత్వ భూములు కాపాడాలనే ఉద్దేశం తో ఒక అధికారి పాల్వంచ ప్రభుత్వ భూములను సర్వే చేయించి వాటి అన్నిటికి ప్రభుత్వ ధనం తో పెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలం అని బోర్డు లు కూడ పెట్టినారు కానీ సదరు అధికారిని వెంటనే పాల్వంచ నుండి బదిలీ చేసినారు ఆ తరువాత ప్రభుత్వ భూమిలో పాతిన బోర్డులు మరియు పెన్సింగ్ ను కొందరు తొలగించారు కానీ వారి మీద స్థానిక రెవెన్యూ శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాల ఆచ్యర్యం ఈ విషయం లో ఇది వరకు కూడ చాల సార్లు అధికారాలకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు.ఒక నిరు పేద వాడు ఒక 50 గజాల స్థలం ఆపుకోని దానిలో చిన్న గుడిసె వేసుకుంటే నాన్ బెల్ కేసు పెట్టి జైలు కు పంపే అధికారులు కొందరు పెద్దలు ప్రభుత్వ భూములు యథేచ్ఛగా అమ్ముకుంటుంటే మాత్రం అటు వైవు కన్నెత్తి కూడ చూడరు పాల్వంచ లో రాజా వారి చేపల చెరువు సినిమా ను తలపించే విధంగా భూములు మాయమౌతున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్ధం కావడం లేదు అని అన్నారు పాల్వంచ లో గతం లో పరిపాలించిన కాంగ్రెస్ & తెరాస ప్రభుత్వ హయం లో అధికారుల సహాయం లో ప్రభుత్వ భూములు మొత్తం వేరొక సర్వే నెంబర్ వేసి రిజిస్టేషన్ లు చేసి అమ్ముకున్నారు ఈ విషయం చాల మంది ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదు కొత్తగూడెం సబ్ రిజిస్టర్ గతం లో పని చేసిన వారు ప్రస్తుతం పని చేస్తున్న వారి పై మరియు రిజిస్టేషన్ కార్యాలయం వద్ద ఎలాంటి భూములకైనా రిజిస్టేషన్ చేయించే ఏజెంట్ల మీద విచారణ జరిపించాలి మరియు ప్రభుత్వ భూములు ఆక్రమించి లేఔట్ లు చేసే వారికీ మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు ఇవ్వడం వలన ఆ ఇంటి నెంబర్ ఆధారంగా ప్రభుత్వ భూములు అమ్మకం చేసినారు కొంత మంది ఘనులు పాల్వంచ లో ముఖ్యంగా 999,817,444,727 లాంటి సర్వే నెంబరు లో 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని గతం లో పనిచేసిన జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ డివిజనల్ అధికారి గారు స్థానిక తహశీల్ధార్ గారు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చినారు కానీ అది కేవలం కాగితాలకే పరిమితం అయినది ఆ భూములు మొత్తం అమ్ముకున్న పట్టించుకోని అధికారులు పాల్వంచ నవభారత్ లో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు444 సర్వే నంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమి ప్లాట్లు చేసి అమ్ముతుంటే ఈ విషయాలు చాల సార్లు పత్రికల్లో వచ్చిన స్థానిక అధికారులు మాత్రం ఆ స్థల ల జోలికి పోవకపోవడం చాల అనుమానాలకు తావు ఇస్తుంది భవిషత్ తరాల అవసరాలకు ప్రభుత్వ భూమి ఎంతో అవసరం అని ఇప్పడికైనా ప్రభుత్వ భూములు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో పూర్తి గా సర్వే చేసి ఆ భూములన్నీ స్వాధీనం చేసుకోవాలని బీజేపీ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం అన్ని తెలిసి ప్రభుత్వ భూములకు రిజిస్టేషన్ చేసిన రిజిస్టేషన్ అధికారుల మీద మరియు వారికీ సహకరించిన మున్సిపల్ అధికారుల మీద విచారణ జరపాలి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం పాల్వంచ లో ఇల్లు లేని సుమారు 3500 పేద కుటుంబాల వారు గత ప్రభుత్వం లో డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకున్నారు అలాంటి ఇల్లు లేని పేద వారికీ కుటుంబానికి ఒక వంద గజాల స్థలం ఇవ్వాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో భట్టు నరేష్,మాదారపు లక్ష్మణ్,ధరావత్ నరేష్,మాలోత్ ప్రశాంత్,పవన్, కిరణ్,కిట్టు ,భట్టు అశోక్,రెడ్డి లు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ