తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : ఇల్లందు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి నిలబడాల్సి వస్తుండటంతో, చెప్పులు, ఆధార్ కార్డుల జిరాక్స్లు, గొడుగులు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామున వచ్చినా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరిపడా యూరియాను అందించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ