తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బూర్గంపాడు మండలంలోని మోతెగడ్డ వీరభద్రుడికి తాళ్లూరి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య కుమారుడు, ప్రవాస భారతీయులు తాళ్లూరి జయశేఖర్, నీలిమ దంపతులు రూ. 20 లక్షల విలువైన బంగారు కిరీటాలను బుధవారం రాత్రి అందజేశారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయం తరుపున దాతలను శాలువాలతో సత్కరించి, అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ