తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్పర్శ్ కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవ కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డా. తుకారం రాథోడ్ లక్ష్మీదేవిపల్లి మండలం, యేదురుగడ్డలోని హేమచంద్రాపురం కుష్ఠు కాలనీని సందర్శించారు.ఈ సందర్భంగా గాంధీజీ ఫోటో ముందు పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుష్ఠు వ్యాధి వల్ల కలిగే వికలాంగతలను నివారించే విధానం, కుష్ఠు రోగుల ఆరోగ్య సంరక్షణ, వ్యాధి సోకే కారణాలు మరియు ప్రభుత్వం అందిస్తున్న కుష్ఠు వ్యాధి సేవల గురించి వారికి అవగాహన కల్పించారు. కుష్ఠు రోగులకు సెల్ఫ్ కేర్ కిట్లు, MCR చెప్పులు మరియు పండ్లు పంపిణీ చేశారు.ఈ రోజు స్పర్శ్ కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవ కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డా. తుకారం రాథోడ్ గారు యేదురుగడ్డ ఎస్టీ వినస్ హై స్కూల్‌ను సందర్శించారు.అలాగే సమతుల ఆహారం (Balanced Diet), వ్యక్తిగత పరిశుభ్రత, “ఈట్ రైట్ & డ్రింక్ రైట్,” సరైన చేతులు కడుక్కోవడం (SUMAN-K విధానం) గురించి వివరించారు. రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అవి ఆరోగ్యానికి హానికరం కావచ్చని సూచించారు.జాతీయ నూలిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) గురించి కూడా అవగాహన కల్పించి, కృమినాశక మాత్రలు తీసుకోవడం పిల్లల ఆరోగ్యానికి అవసరమని తెలిపారు. ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేస్తోందని, ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డా. తుకారం రాథోడ్ (DM&HO), డా. పుల్లారెడ్డి (PO NTEP), డా. తేజశ్రీ (PO CHI), డా. స్వప్న (MO, PHC రేగల్ల), DPMO మోహన్, భద్రు PT మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.స్పర్శ్ కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవ కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డా. తుకారం రాథోడ్ లక్ష్మీదేవిపల్లి మండలం, యేదురుగడ్డలోని హేమచంద్రాపురం కుష్ఠు కాలనీని సందర్శించారు.ఈ సందర్భంగా గాంధీజీ ఫోటో ముందు పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుష్ఠు వ్యాధి వల్ల కలిగే వికలాంగతలను నివారించే విధానాలు, కుష్ఠు రోగుల ఆరోగ్య సంరక్షణ, వ్యాధి సోకే కారణాలు మరియు ప్రభుత్వం అందిస్తున్న కుష్ఠు వ్యాధి సేవల గురించి వివరించారు. కుష్ఠు రోగులకు సెల్ఫ్ కేర్ కిట్లు, MCR చెప్పులు మరియు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ (కుష్ఠు) డా. బి. పుల్లా రెడ్డి, PO CHI డా. తేజశ్రీ, మెడికల్ ఆఫీసర్ PHC రేగళ్ల డా. స్వప్న, DPMO మోహన్, జి. భద్రు (Leprosy PT), ఆరోగ్య సిబ్బంది, కుష్ఠు రోగులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ