Sunday, 19 April 2026 02:45:07 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు భాగస్వాములు కావాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 20 December 2025 07:01 PM Views : 180

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా చేరవేసే బాధ్యతను సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు స్వీకరించి, యువతలోచైతన్యం కలిగించే విధంగా భాగస్వాములుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.శనివారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి, ముక్కోటి సందర్భంగా నిర్వహించనున్న ఏరు రివర్ ఫెస్టివల్ను విజయవంతం చేయడానికి చేపట్టవలసిన చర్యలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికత, గిరిజన సంస్కృతి సమ్మేళనంగా ఉన్న జిల్లాగా గుర్తింపు పొందిందని అన్నారు. జిల్లాలోని పగిడేరు వేడి నీళ్లు, గోదావరి నది పరివాహక ప్రాంతాలు, కనిగిరి గుట్టలు, కిన్నెరసాని అడవీ ప్రాంతాలు వంటి అనేక విశిష్టమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతాలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో పర్యాటక పటంలో స్థిరపరచడానికి విస్తృత స్థాయి ప్రచారం అత్యవసరమని అన్నారు.పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చవచ్చని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పర్యాటకుల రాక పెరిగితే హోటళ్లు, రవాణా, హస్తకళలు, స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలను ఎకో టూరిజం హబ్‌లుగా అభివృద్ధి చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని వివరించారు.పర్యాటక రంగంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల విశిష్టతను వీడియోలు, ఫోటోలు, కథనాల రూపంలో డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు చేరవేస్తే జిల్లాకు విశేష గుర్తింపు లభిస్తుందని అన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని సానుకూల సందేశాలతో జిల్లాను ప్రమోట్ చేయాలని సూచించారు.ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏరు రివర్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా,22వ తేదీన బెండలపాడు లోని కనిగిరి గుట్టల ట్రెక్కింగ్,23వ తేదీన కిన్నెరసాని రివర్ వాక్ ముత్తాపురం నుండి మొతలగూడెం బ్రిడ్జి వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల వాకింగ్ కార్యక్రమం,24వ తేదీన పాల్వంచలోని శ్రీనివాస్ గిరి గుట్ట ట్రెక్కింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 26వ తేదీన దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్పలో సాయంత్రం 4.30 గంటలకు ట్రైబల్ ఈవినింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంప్రదాయ నృత్యాలు, సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.27వ తేదీన భద్రాచలం గోదావరి నది ఒడ్డున సాంస్కృతిక కార్యక్రమాలు, ఆసక్తి గల యువత ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని తెలిపారు.28వ తేదీన గోదావరి నది ఒడ్డున సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు,29వ తేదీన పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు,30వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. పర్యాటకుల సౌకర్యార్థం గోదావరి నది ఒడ్డున క్యాంపులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాలన్నింటిలో ఆసక్తి గల యువత, పర్యాటకులు చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు జిల్లాలో జరుగుతున్న పర్యాటక, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంలో భాగస్వాములై, విస్తృత స్థాయిలో ప్రజలకు చేరవేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. యువతను చైతన్యపరచే విధంగా సానుకూల దృక్పథంతో కార్యక్రమాలను ప్రచారం చేయాలని సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :