తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాచలం రామయ్య భక్తులు, ప్రజల ఆశలు చిగురిస్తున్నాయి. హైదరాబాద్ DRUCC సభ్యులతో సౌత్ సెంట్రల్ రైల్వే DRM సమావేశం నిర్వహించారు. కొత్తగూడెం నుంచి DRUCC సభ్యుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రద్దయిన రైళ్ల పునరుద్ధరణ, శిర్డీ, తిరుపతికి రైళ్ల ఏర్పాటు, కాకతీయ రైలు మణుగూరుకు పొడిగింపు, బెల్గావి రైలు పునరుద్ధరణ అంశాలను లేవనెత్తారు. అధికారుల నుంచి సానుకూల స్పందన రావటంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ