Thursday, 25 June 2026 08:05:26 AM
# ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఐదుగురికి జైలు శిక్ష. # అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య. # ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.45 లక్షల చెక్కు అందజేత – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. # విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ . # మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # బిజెపిలో పనిచేసే సామాన్యులకే ప్రాధాన్యత నిస్తుంది.బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు. # కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. # నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ఊపిరి

Date : 23 June 2026 05:25 PM Views : 21

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్త స్థలంపై కేంద్రానికి ప్రతిపాదనలు 10 రోజుల్లో ఫీజిబిలిటీ నివేదిక ఇవ్వాలని అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశం రాంమోహన్ నాయుడిని కలిసిన మంత్రులు తుమ్మల, ఉత్తమ్ జులైలో మామునూరు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన దశాబ్దాలుగా భద్రాద్రి జిల్లావాసులు ఎదురుచూస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే ప్రతిపాదించిన స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలం కాదని తేలడంతో ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించిన ప్రభుత్వం, అక్కడ సాధ్యాసాధ్యాల పరిశీలనను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్‌ నాయుడిని కలిసి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు. గత రెండు ప్రతిపాదనలకు సాంకేతిక అడ్డంకులుః కొత్తగూడెం సమీపంలో గతంలో ప్రతిపాదించిన రెండు స్థలాల్లో విద్యుదీకృత రైల్వే మార్గం, కొండలు అత్యంత సమీపంలో ఉండటం వల్ల విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భద్రతా ప్రమాణాలు నెరవేరడం లేదని ఫీజిబిలిటీ అధ్యయనాల్లో తేలిందని మంత్రి తుమ్మల వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, దానిపై సమగ్ర నివేదిక రూపొందించేందుకు ఏవియేషన్ సంస్థను నియమించినట్లు తెలిపారు. కొత్త స్థల ప్రతిపాదనపై 10 రోజుల్లో నివేదికః కొత్తగా ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించి ఫీజిబిలిటీ నివేదికను పది రోజుల్లో అందజేయాలని కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రక్రియలను అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు త్వరలో శంకుస్థాపనః ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే వరంగల్ జిల్లా మామునూరు మరియు ఆదిలాబాద్ విమనాశ్రయాల నిర్మాణాలపై చర్చలు జరిపినట్లు కేంద్రమంత్రి తెలిపారు. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయానికి జులైలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు ఈ సందర్భంగా వెల్లడించారు. అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టును త్వరలోనే రక్షణశాఖ ద్వారా అనుమతులు పొంది, వారి ద్వారానే నిర్మాణం చేపట్టడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భద్రాచలం భక్తులకు వరంః దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని చెప్పారు. పారిశ్రామిక, విద్యా రంగాలకు కొత్త ఊపుః సింగరేణి బొగ్గుగనులు, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ, బీపీఎల్ వంటి ప్రముఖ పరిశ్రమలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పటికే ప్రత్యేక పారిశ్రామిక గుర్తింపు పొందిందని తుమ్మల తెలిపారు. జిల్లాలో ఉన్న అటవీ సంపద, ఖనిజ వనరులు, ఎకో టూరిజం అవకాశాలు, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులకు విమానాశ్రయం మరింత బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు విద్యా, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారంః గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, అనుమతుల ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు త్వరలోనే వాస్తవరూపం దాల్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: