తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 20 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం ఉప మార్కెట్ నందు మార్కెట్ అధికారులు కొత్తగా సూచించిన నియమ నిబంధనలను అనుసరించి పత్తి కొనుగోలు చేయలేమని వ్యాపారస్తులు బుధవారం రోజున కొనుగోలు నిలిపివేశారు. దీంతో రైతులంతా పత్తి కొనుగోలు చేయాలని ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. రైతులకు అండగా వామపక్షాలు ధర్నాలో పాల్గొన్నాయీ .
గంటసేపు రహదారిపై బైఠాయించిన రైతులు లేవకపోవడంతో ప్రధాన రహదారిపై వాహనాలు అధిక మొత్తంలో నిలిచిపోవడంతో జూలూరుపాడు పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న కొత్తగూడెం డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ వచ్చి రైతులతో మాట్లాడారు. రైతులు వ్యాపారస్తులు మా పత్తిని కొనుగోలు చేసే వరకు విరమించమని చెప్పగా డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ మరియు ఏన్కూర్ మార్కెట్ శాఖ సూపర్వైజర్ రామారావు వ్యాపారస్తులతో వివిధ ప్రాంతాల నుంచి రైతులు పత్తిని విక్రయించేందుకు వచ్చారు కనుక వారిని ఇబ్బంది పెట్టకుండా ఈ ఒక్కరోజు పాత పద్ధతిలోనే కొనుగోలు చేయమని చెప్పారు. అనంతరం వ్యాపారస్తులు పత్తిని కొనుగోలు చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ