తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హిందువులకు అంత్యంత ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. విజయ దశమి, దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు జూలూరుపాడు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో ఉన్న సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బతుకమ్మ మరియు దుర్గాదేవి శరన్నవరాత్రులు లలో భాగంగా ముందస్తుగా సంబరాలు నిర్వహించారు చిన్నారులంతా అమ్మవారి వేషధారణలో దుర్గాదేవి తొమ్మిది రోజుల పూజా కార్యక్రమాలు లలో రోజుకొక్క అవతారంతో దర్శనమిచ్చే దుర్గాదేవి, తొమ్మిది రోజుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తారు , దుర్గాదేవి, బాలా త్రిపుర సుందరి, సరస్వతి దేవి, గాయత్రీ దేవి, లలితా దేవి, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మి అమ్మవారు, వనదేవత, కాళికామాత ఇలా తొమ్మిది అవతారాలలో దర్శనమిచ్చే అమ్మవార్లను పిల్లలు వేషధారణలో పాఠశాల నందు సందడి చేశారు తదుపరి బతుకమ్మ పాటలతో నృత్యాలు చేశారు. ఓ చిన్నారి మహిషాసుర మర్దిని గా కాళికామాత అవతారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
Admin
తెలుగు వెలుగు టీవీ