Thursday, 25 June 2026 08:03:02 AM
# ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఐదుగురికి జైలు శిక్ష. # అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య. # ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.45 లక్షల చెక్కు అందజేత – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. # విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ . # మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # బిజెపిలో పనిచేసే సామాన్యులకే ప్రాధాన్యత నిస్తుంది.బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు. # కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. # నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 24 June 2026 05:35 PM Views : 10

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికి వెళ్లినప్పుడు అనుసరించాల్సిన విధానాలు, ఫారాల సమర్పణ ప్రక్రియ, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాలు, ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ దశలు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, ఆఫ్‌లైన్ ఫారాల పూర్తి విధానం తదితర అంశాలను వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ విజయవంతం కావడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సహకరించాలని కోరారు. ఇప్పటికే బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అధికారులు క్షేత్రస్థాయి సన్నాహక శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు బీఎల్‌వోలు ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తారని తెలిపారు. 2002 ఓటర్ల జాబితా ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలను ధృవీకరించి నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జూలై 24 నుండి 30 వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడతామని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుందని, అనంతరం అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తప్పు సమాచారం సమర్పించిన సందర్భాల్లో వెంటనే తొలగింపు చేయకుండా, ముసాయిదా జాబితా అనంతరం నోటీసులు జారీ చేసి విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వలస వెళ్లిన, మరణించిన, డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత జాబితాలో పేరు లేని అర్హులైన కొత్త ఓటర్లు తప్పనిసరిగా ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన వారు ఫారం–8 ద్వారా వివరాల సవరణ చేసుకోవచ్చని అన్నారు . ప్రతిరోజు బీఎల్‌వోలు గరిష్ఠంగా 50 ఫారాల వరకు సమర్పించే అవకాశం ఉందని తెలిపారు. బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు సమన్వయంతో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసే యువత కూడా కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు. అనంతరం రాజకీయ నాయకులు పార్టీ ప్రతినిధులకు తలెత్తిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల శాఖ సూపర్డెంట్ రంగ ప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ వెంకటేశ్వర నాయక్, అన్వర్, కాంగ్రెస్ పార్టీ నుండి లక్ష్మణ్ అగర్వాల్, సిపిఐ పార్టీ నుండి అన్నవరపు సత్యనారాయణ, బిజెపి పార్టీ నుండి రవి నాయక్ తదితరులు, ఎన్నికల శాఖ సిబ్బంది నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :