తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 13 (తెలుగు వెలుగు) ఏనుకూరు మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ భూక్యా సాగర్ బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది పోలీస్ అధికారులు తనను గంజాయి కేసులో ఇరికించారని, అవమానాలు గురి చేశారని మనస్థాపానికి గురై శనివారం రోజున ఆత్మహత్య పాల్పడ్డాడు. అతనిని హైదరాబాదులో ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించగా వైద్యం పొందుతూ ఆదివారం రోజున మరణించాడు.భూక్యా సాగర్ ఆత్మహత్యకు కారకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలనీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పటానికి కారకులపై ప్రభుత్వం వెంటనే పోలీసు ఉన్నంత అధికారులతో సమగ్ర విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం అధికారులు సరైన పద్ధతిలో స్పందించకపోతే ఆందోళన చేపడుతామని తెలిపారు. సాగర్ వాంగ్మూలం లో ప్రకటించిన పేర్లు వారే బాధ్యత వహించాలని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ