తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డి సి హెచ్ ఎస్ డా.రవి బాబు, చర్ల ఆసుపత్రి సిబ్బందికి ప్రత్యేక ప్రశంస. డి సి హెచ్ ఎస్ బృందాన్ని రాష్ట్ర సచివాలయానికి పిలిచి ప్రత్యేకంగా అభినందించినా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర, ప్రధాన కార్యదర్శి క్రిస్టినా.భద్రాద్రి జిల్లా లో ని ఏజెన్సీ ప్రాంతాల్లో టీవీవీపీ ఆసుపత్రులలో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని, సిబ్బంది చాలా అంకిత భావం తో మెరుగైన పనితీరు కనబరిచి, ఇతర జిల్లాలకి స్ఫూర్తి దాయకంగా సేవలు అందిస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నర్సింహా భద్రాద్రి జిల్లా టీవీవీపీ ఆసుపత్రుల పనితీరు పై ప్రశంసలు కురిపించారు. డీ సి హెచ్ ఎస్ డా రవి బాబు తో పాటు చర్ల , మణుగూర్, భద్రాచలం, ఎల్లందు , అశ్వారావుపేట ఆసుపత్రుల సిబ్బంది ని సచివాలయానికి ఆహ్వానించి హెల్త్ సెక్రటరీ క్రిస్టినా తో కలిసి జ్ఞాపికలు అందించి అభినందనలు తెలియజేశారు.చర్ల లాంటి మారుమూల ప్రాంతంలో లో సైతం అందుబాటులో ఉన్న వసతులతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని, చర్ల స్ఫూర్తితో ఇతర జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ఇదే తరహా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకోనిరావడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఇటీవల చర్ల ఆసుపత్రిలో లో వైద్య సదుపాయాల పై జాతీయ పత్రికలో ప్రధాన శీర్షికల్లో ప్రచురించిన వార్తల ఆధారంగా మంత్రి భద్రాద్రి ఏజెన్సీ లోని ఆసుపత్రుల సేవలపై స్పందించారు. ఆసుపత్రుల సూపరింటెండ్లు వారి సిబ్బంది చాలా కష్టపడి నిబద్ధత తో పనిచేస్తున్నారని, జిల్లాలోని నలుమూలల ఆసుపత్రుల బాగా అభివృద్ధి చెందాయని, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ ఎన్నో సవాళ్లని ఎదుర్కొని జిల్లా లోని అన్ని ఆసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా సేవలు అందించే దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకి నమ్మకం కలిగేలా చేసిన జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ జి రవి బాబు ని ప్రత్యేకంగా అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ