తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 11 తెలుగు వెలుగు) : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జూలూరుపాడు మండలంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) తాళ్లూరి రవిపరిశీలించారు. వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, వంట విధానం మరియు పరిశుభ్రత అంశాలను పరిశీలించి, విద్యార్థులకు సమయానికి పౌష్టికాహారం అందించేలా సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అలాగే వసతి గృహంలో స్టోర్ రూమ్, శుభ్రత, వంటశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు పట్టిక ను పరిశీలించారు. మరియు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.వసతి గృహంలోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కట్టుబడి ఉన్నారని MPDO తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ