తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో గల శ్రీనగర్ కాలనీ నందు మండపంలో కొలువుదీరిన దుర్గామాతను టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగాసీతారాములు దర్శించుకున్నారు . ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు . అనంతరం నాగాసీతారాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో , ఆయురారోగ్యాలతో , అష్టఐశ్వార్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు . అనంతరం నిర్వాహకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు . ఈకార్యక్రమంలో ఓబిసి పట్టణ అధ్యక్షులు అమడగాని.జయప్రకాష్, ఓబీసీ జిల్లా సెక్రెటరీ బొబ్బల.వెంకట్ యాదవ్,మైనారిటీ టౌన్ సెక్రటరీ ఖాదర్ భాయ్,యువజన నాయకులు బన్ను,రాజగోపాల్ స్థానిక కమిటీ నిర్వాహకులు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ