తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో వయోవృద్ధుల కొరకు మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ నడుపుటకు స్వచ్ఛంద సంస్థలు మరియు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి జే.యమ్.స్వర్ణలత లెనిన తెలియజేశారు.1. మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ నిర్వహించే వారు తెలంగాణ సొసైటీ రిజిస్ట్రేషన్ 2001 లేదా ద కంపెనీస్ యాక్ట్ 1956 లేదా ఇండియన్ ట్రస్టు యాక్ట్ 1882 ద్వారా రిజిస్టర్ అయి ఉండాలి.2. ఎన్.జి.ఓ. లేదా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లేదా చిల్డ్రన్స్ హోమ్ లేదా షెల్టర్ హోమ్స్ నిర్వహించడంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.3. ఎన్జీవో లేదా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ బ్లాక్ లిస్టులో ఉండడం, ఫైనాన్సియల్ ఫ్రాడ్ కేసుల్లో ఉండటం వంటి దరఖాస్తులు తిరస్కరించబడును. ఆసక్తి గల ఎన్జీవో లేదా సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ పెట్టుకొనుటకు దరఖాస్తులను జిల్లా సంక్షేమ శాఖ వారి కార్యాలయం, ఐ.డి.ఓ.సి. పాల్వంచ నందు ఈ నెల 15 వ తేదీ లోగా అందించవలసిందిగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయుచున్నాము . వివరముల కొరకు 630 198 1960, 833 100 6010 నంబర్లను సంప్రదించగలరు.
Admin
తెలుగు వెలుగు టీవీ