తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్, కో-ఆపరేటివ్, చేనేత అనుబంధ సంస్థల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలోని కమలాపురం, తొట్టిపంపు గ్రామాలలో సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలను పరిశీలించారు ప్రాజెక్ట్ పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారుల ద్వారా వివరాలను సేకరించారు.అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గం యాతాలకుంట లిఫ్ట్ ఇరిగేషన్ కేంద్రాన్ని సందర్శించి సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కాలువ పనుల ప్రస్తుత స్థితిని సమీక్షించారు పనులు సమయానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ