తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మంగళవారం నాడు TBGKS కార్మిక సంఘం కేంద్ర కార్యవర్గ సమావేశం జరిగినది. ఈ సమావేశం లో పాల్గొన్న TBGKS కేంద్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ కూసన వీరభద్రం మాట్లాడుతూ కార్మిక సంఘం ఎన్నికల నిబందనావళి ప్రకారం గెలిచిన సంఘానికి 45 రోజుల్లో గుర్తింపు పత్రం అందజేయాలి లేని యెడల మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి లేదా గతంలో గెలిచిన గుర్తింపు సంఘంతోనే సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు జరిపాలి, గుర్తింపు పత్రం లేని కారణంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసి యూనియలు రెండూ నాటకాలు ఆడుతూ కార్మిక సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు,అలాగే కార్మికులు ఎంతో కష్టపడి తమ రక్తం చిందించి సాధించిన లాభాల్లో వాటాను 35% తక్షణమే ఇవ్వాలని,కార్మికులకు పని ప్రదేశంలో రక్షణ చర్యలు పటిష్ట పరచాలి, సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో MIR scanner,డయాలసిస్ సదుపాయాలను మెరుగుపరచాలి,కార్మికులకు మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ రిఫరెల్ పంపిస్తున్నా అక్కడ హాస్పిటల్ యాజమాన్యాలు ట్రీట్మెంట్ సరిగా ఇవ్వటం లేదు నిమ్స్ టారిఫ్ తో కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకోలేక తీవ్రంగా నష్ట పోతున్నారు దీనిపై సింగరేణి యాజమాన్యం సారించి రిఫరెల్ టారిఫ్ పెంచాలి, గ్రీవెన్స్ సెల్ ను క్రమం తప్పకుండా నిర్వహించాలి కార్మికుల సమస్యలపై వేగముగా స్పందించి ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలని యాజమాన్యాన్ని అభ్యర్థించారు.ఢిల్లీ లిక్కర్ కేసులో లో కల్వకుంట్ల కవిత తనపై ఆరోపణలకు సరియైన ఆధారాలు లేనందున బెయిల్ పై విడుదలైనందుకు కూసన వీరభద్రం హర్షం వ్యక్తం చేస్తూ కల్వకుంట్ల కవితను మరల TBGKS గౌరవ అధ్యక్షురాలుగా నియమించాలని ఆ విధముగా మన TBGKS యూనియన్ ని బలోపేతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ తన డిమాండును పరిశీలించవలసినదిగా కార్మిక సంఘం కేంద్ర కార్యవర్గాన్ని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ