తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంకు చెందిన సీనియర్ న్యాయవాదులు ఎలమోలు ఉదయ భాస్కర రావు, రమేష్ కుమార్ మక్కడ్ లను కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నాడు అభిమానుల హర్ష ధ్వానాల మధ్య కృతజ్ఞతపూర్వకంగా శాలువా తో సత్కరించారు.తన ఎన్నికను రద్దు చేయాలని తెలంగాణ హై కోర్టులో వేసిన కేసు పరిష్కారం కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, తమ అనుభవాన్ని రంగరించి, స్వచ్ఛందంగా పనిచేసి, సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్ గార్కి సహకరించిన కొత్తగూడెంకు చెందిన సీనియర్ న్యాయవాదులు ఎలమోలు ఉదయ భాస్కర రావు, రమేష్ కుమార్ మక్కడ్ లకు కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు కృతజ్ఞతలు తెలియ చేశారు.ఈ సందర్బంగా కూనంనేని ప్రసంగిస్తూ తన ఎన్నికను సవాలు చేస్తూ హైకోర్టులో వేసిన కేసు గెలిపించుటకు కృషి చేసిన సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్, ఆయన కుమారుడు ప్రసేన్, వారికి సహకరించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్ లకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా, జిల్లా కౌన్సిల్ సభ్యులు, న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు, కార్మిక నాయకులు వంగ వెంకట్, వత్తికొండ మల్లికార్జున రావు, రామవరం సి.పి.ఐ. నాయకులు షేక్ ఫహిం, గుత్తుల శ్రీను, ఖయ్యుమ్, దాసరి అశోక్, ఇంకా అనేక మంది అభిమానులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ