తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 4 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల పరిధిలో అనంతారం రామచంద్రపురం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. చండ్రుగొండ మండలం వెంకటా తండా నుండి డీజే సౌండ్ సిస్టం తో వస్తున్న వెహికల్ చండ్రుగొండ మండలం పాకులగూడెం గ్రామానికి చెందిన బానోత్ రవి, ధరావత్ రత్న ఇద్దరూ జూలూరుపాడు పురుగు మందుల షాప్ దగ్గరకు వెళ్లి మందులు తీసుకొని వస్తున్న క్రమంలో అనంతారం గ్రామం వద్ద డీజే సిస్టం ఉన్న వెహికల్ ఢీకొనడం జరిగింది. టూ వీలర్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వీరి ఇరువురిని 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ