Wednesday, 15 April 2026 05:20:43 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

“ రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రమాదాల నివారణ – విద్యార్థులు మార్గదర్శకులుగా నిలవాలి” : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 15 April 2026 02:10 PM Views : 8

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్ – అ లైవ్” కార్యక్రమంలో భాగంగా బుధవారం పాత కొత్తగూడెం హనుమాన్ బస్తీ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ అంకిత్ ఘనంగా ప్రారంభించారు. “రహదారుల భద్రత మన అందరి బాధ్యత” అనే నినాదంతో ప్రారంభమైన ఈ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ రహదారుల భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించడం అత్యంత కీలకమని అన్నారు . చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన పెంపొందితే భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని అన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కార్లలో ప్రయాణించే సమయంలో సీట్ బెల్ట్ ధరించాలనే విషయాన్ని గుర్తుచేయాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ వినియోగం, రోడ్డు నియమాల పాటింపు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాఠశాలల్లో రోడ్డు భద్రతపై పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు ప్రత్యేక అవగాహనా తరగతులు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీలు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో భద్రతపై చైతన్యం పెంపొందించాలన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. “అరైవ్ – అ లైవ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కల్పించడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏం ఈ ఓ మధురవాణి, ప్రధానోపాధ్యాయులు లక్ష్మి, కోఆర్డినేటర్ నాగశేఖరా శర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు, పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :