తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవంగా ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ పతాకావిష్కరణ చేయాలని ఆదేశించింది. దానిలో భాగంగా జూలూరుపాడు మండల అభివృద్ధి కార్యాలయం నందు ఎంపీడీవో తాళ్లూరి రవి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో తులసీరామ్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ