తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియుజిల్లా పర్యటనలో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ వి. సుబ్బారావు కలిసి అశ్వాపురం మరియు బూర్గం పహాడ్ మండలాల పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్గంపహడ్ మండలంలోని ఇరవెండి గ్రామ పంచాయతీ పరిధిలో తాజరాణి లలిత కుమారి ఫిష్ ఫార్మింగ్ యూనిట్‌ను పరిశీలించి, లబ్ధిదారులతో ప్రత్యక్షంగా చర్చించారు. యూనిట్ మొత్తం విలువ రూ. 5,00,000గా, ఇందులో సబ్సిడీ రూ. 1,75,000, రుణం రూ. 3,00,000, వాటా ధనం రూ. 25,000గా ఉంది. యూనిట్ PMEGP పథకం కింద ఏర్పాటు చేయబడిందని లబ్ధిదారు వివరించారు. అనంతరం నాగినేనిప్రోలు గ్రామ పంచాయతీని సందర్శించి, పంచాయతీ కార్యాలయం, అంగనావాడి కేంద్రాలు, ప్రైవేట్ పాఠశాలలో ఎంపీపీ ఎస్ పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితులు, ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాల శుభ్రత మరియు ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లలకు సరైన పోషకాహారం, 14–18 వయస్సు గల యువతకు పాఠశాలల్లో సదుపాయాలు అందిస్తున్నాయో కూడా పరిశీలించారు. అశ్వపురం మండలంలోని నెల్లిపాక బంజర గ్రామ పంచాయతీ పరిధిలో M. రామకృష్ణ మునగా తోటను పరిశీలించి, పంట దిగుబడి, మార్కెట్ సౌకర్యాలు మరియు పంటకు అందుతున్న ఇతర సహాయాలు గురించి రైతుతో చర్చించారు.ఈ పర్యటన ద్వారా మండలాల పంచాయతీలు, విద్యా, సాంఘిక, వ్యవసాయ మరియు సంక్షేమ రంగాల్లోని సౌకర్యాలను పరిశీలించడం, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది. ఈ పరిశీలనలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన MPDOలు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ