Friday, 19 June 2026 06:39:36 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

తెలంగాణ బొగ్గు గని సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ధర్నా

Date : 02 September 2025 07:43 PM Views : 598

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ , మిర్యాల రాజి రెడ్డి , ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, జనరల్ సెక్రెటరీ సురేందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు, కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు మాజీ శాసన సభ్యురాలు హరిప్రియ నాయక్, మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బదవత్ శాంత, వనమా రాఘవ పాల్గొన్నారు. సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాలు వెల్లడించడంతోపాటు 35% వాటా ప్రకటించి మరియు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం అసాధారణ జాప్యం చేస్తున్నది. సింగరేణి సంస్థలో మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి, కార్మికుల రక్షణ, సంస్థ ఆస్తులను కాపాడుతూ కొత్త బొగ్గు గనులను తీసుకురావడానికి కృషి చేయవలసిన బాధ్యతలను విస్మరించింది. అందుకు విరుద్ధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల కార్యాలయాల వద్ద సింగరేణి అధికారులు పడిగాపులు కాస్తున్నారు. ఇది అత్యంత గర్హనీయమైన చర్య. ఇప్పటికైనా సంస్థ భవిష్యత్తును, కార్మికుల మనోభావాలను గమనించి నడుచుకోవాలని కోరుతున్నాం. కార్మికుల హక్కులను కాపాడటం, సాధించడంలో గుర్తింపు సంఘం ఏఐటియూసి, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ఘోరంగా విఫలమయ్యాయి. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న యాజమాన్యానికి వంత పాడుతూ కాలక్షేపం చేస్తున్నాయి. ఈ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తున్నది. 1)వాస్తవ లాభాలపై 35% వాటాను ప్రకటించాలి. 2)కార్మికులకు ఆదాయపుపన్ను ను రద్దు చేయాలి, అలవెన్స్ లపై ఆదాయపన్ను ను యాజమాన్యమే చెల్లించాలి 3)అనారోగ్య సమస్య లతో మెడికల్ బోర్డ్ కి వెళ్లే కార్మికులందరిని అన్ ఫిట్ చేయాలి. 24 నెలల సర్వీస్ కాల పరిమితిని 36 నెలలకు పెంచాలి. 4)వేలం పాట తో సంబంధం లేకుండా సింగరేణికి నూతన బొగ్గుగనులు కేటాయించాలి 5)సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన 43 వేల కోట్ల రూపాయల బకాయిలను కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులు తక్షణమే ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం 6)మెడికల్,ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డిపెండెంట్ లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి 7)35 సంవత్సరాల నుండి 40 ఏళ్లకు వయసు పరిమితిని పెంచిన యాజమాన్యం వారిలో 10th క్లాస్ సర్టిఫికేట్ లేని వారిని విజిలెన్స్ కు పంపడాన్ని నిలిపివేసి వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. 8) మారుపేర్లతో పనిచేస్తూ అన్ ఫిట్ అయినా కార్మికుల పిల్లలకు వన్ టైం సెటిల్మెంట్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి వారిని ఆదుకోవాలి. 9)జూలై నెలలో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఉత్తర్వులు ఇచ్చిన 50 మంది ఉద్యోగులను తిరిగి మెడికల్ బోర్డు కు పిలిచి వారందరిని అన్ ఫిట్(ఇన్వాలిడేషన్)చేయాలి 10)కొత్త ట్రాన్స్ఫర్ పాలసీ ని రద్దు చేయాలి. ట్రాన్స్ఫర్ పాలసీ పారదర్శకంగా ఉండేలా చూడాలి. ఈ సమస్యల మీద డైరెక్టర్ పా గౌతమ్ పొట్రూ ఐఏఎస్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది . ఈ ధర్నా కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు అన్ని ఏరియాల వైస్ ప్రెసిడెంట్లు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, సెంట్రల్ కమిటీ సభ్యులు, బ్రాంచ్ సెక్రటరీలు, బ్రాంచి కమిటీ సభ్యులు, ఫిట్ సెక్రటరీలు, హిట్ కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సింగరేణి కార్మికులు డిఎల్ఆర్ కార్మికులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :