తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామీణ ప్రాంత ప్రజలు, హిందువుల ఆరాధ్య దైవమైన పోచమ్మ తల్లి ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకు వినతిపత్రం అందించారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పోచమ్మ తల్లి విగ్రహాన్ని, ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి వారిని వదిలి పెట్ట వద్దని పోలీసులు కోరినట్లు తెలిపారు. చుంచుపల్లి మండల పరిధిలోని కార్మిక ప్రాంతంగా ఉన్న గౌతమ్ పూర్ లోని పోచమ్మ తల్లి ఆలయాన్ని ధ్వంసం చేయడం విచారకరమన్నారు. మండల వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులు అందరిని కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామన్నారు. దీనికి కారకులైన వారిని వెంటనే శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. దేవాలయాలను ధ్వంసం చేసే విధంగా కొంతమంది దుండగులు పాల్పడటం విచారకరమన్నారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. పోచమ్మ తల్లిని గ్రామదేవతగా కొలిచే ఆనువాయితీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగిన పోచమ్మ తల్లికి పూజలు చేసినా అనంతరమే కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటారని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈరోజు చిన్న ఆలయమే కదా అని వదిలేస్తే రేపు పెద్ద దేవాలయాలు కూడా ముప్పు పొంచి ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను వదిలి పెట్టవద్దని ఎస్పీకి అందించిన వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో జాతోత్ వెంకన్న, బలగం శ్రీధర్, పొన్నకంటి రాజు, బడే రమేష్, మంగిలాల్ స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ