Sunday, 19 April 2026 02:17:02 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రీ ప్రైమరీ పాఠశాలలో పిల్లలను చేర్పించండి.

Date : 25 August 2025 07:20 PM Views : 430

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ పాఠశాలలలో పిల్లలను చేర్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. జిల్లాలోని 21 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీకి తరగతుల ప్రారంభించడానికి ప్రభుత్వము నుండి అనుమతి వచ్చిన సందర్భంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ ఈ 21 పాఠశాలల పరిధిలోని నాలుగు సంవత్సరాలు నిండిన బాల బాలికలను ప్రీ ప్రైమరీ తరగతులలో జరిపించడానికి మండల విద్యాశాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఈ పిల్లలకు కావలసిన యూనిఫామ్, పుస్తకాలు, క్రీడా పరికరాలు, అందించనున్నామని, పాఠశాలను రంగులతో ఆకర్షణీయంగా తయారు చేసి పిల్లలను ఆకర్షించాలని అన్నారు. ఈ పిల్లలకు మధ్యాహ్న భోజనం అదేవిధంగా అల్పాహారం కూడా అందించనున్నామని కలెక్టర్ తెలిపారు. పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి వారికి కావలసిన వైద్య సహాయం కూడా అందించడానికి ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. పిల్లలకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో మండల విద్యాశాఖ అధికారులు ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని, ప్రతి పాఠశాలలో కనీసం 20 మంది పిల్లలు ఉండేటట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసి పిల్లలను ఒక పండగ వాతావరణం లో పాఠశాలల్లో చేర్పించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి బి.నాగలక్ష్మి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలతా లేనినా, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :