తెలుగు వెలుగు టీవీ - వార్తలు / మణుగూరు : మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కట్టవాగు, మెట్టవాగు, కోడిపుంజుల వాగు పూడిక తీత పనులలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పట్టించుకోకుండా హడావుడి గా పనులు చేసి చేతులు దులుపు కొని, ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని, మాజీ జెడ్పిటిసి, ఆదివాసి సంఘం రాష్ట్ర నాయ కురాలు మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గా మండిపడ్డారు. వాగు పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించని కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని, ప్రజాధ నాన్ని కాపాడాలని కోరుతూ ఆమె మంగళవారం మున్సిపల్ కమిష నర్ ప్రసాద్ కు వినతిప త్రాన్ని అందజేశారు. అనంతరం దుర్గా మాట్లాడుతూ.. ఏజెన్సీ నియోజకవర్గ కేంద్రమైన మణుగూరు పట్టణంలో ప్రభుత్వం కోట్లాది రూపాయలను అభివృద్ధి పనులకు కేటాయిస్తే, అభివృద్ధి నేడు కొందరు కాంట్రాక్టులకు వరంగా మారిందని ఆరోపించారు. కనీసం నామినేషన్ పద్ధతి ప్రకారం కాకుండా అధికార పార్టీకి చెందిన అనునయులకే కాంట్రాక్ట్ పనులు తగ్గటం ఇక్కడ పరిపాటిగా మారిందన్నారు. ఎలా పనులను కేటాయిస్తారని ఆమె ప్రశ్నించారు. ఓవైపు సింగరేణి సేఫ్ నిధులతో చేపట్టిన పనుల లో కూడా బినామీలు పెత్తనం చెలాయిస్తున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టేందుకు కాంట్రాక్టుల పేరిట కొందరు పనులను దక్కించుకొని బిల్లులను పొందారని, నాసిరకం పనులతో ప్రతి సంవత్సరం ప్రజలకు వరద ముంపు కష్టాలు తప్పడం లేదన్నారు. మరోవైపు సిసి రోడ్లు పనులలో కూడా ఓ కాంట్రాక్టర్ ధన దాహం దాగి ఉందని ద్వజ మెత్తారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రజల కష్టాల ను పట్టించుకోకుండా, మండలంలో ఓ బినామీ వివిధ పేర్లతో సీసీ రోడ్లు, అంగన్వాడి కేంద్రా లు, స్కూల్ బిల్డింగ్ పనులు దక్కించుకొని చక్రం తిప్పుతున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బినామీ కాంట్రాక్టర్ పనులపై ఐటీ డీఏపిఓ, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. వాగు పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తో కనీసం వరద నీరు పారని పరిస్థితి నెలకొందని, నిన్న కురి సిన కొద్దిపాటి వర్షానికే ప్రధాన రహదారులు జలమయమ య్యాయని విమర్శించారు. ఇప్ప టికైనా అధికారులు తగు చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశా రు. లేనిచో గిరిజన ప్రజలను కూడగట్టి ప్రభుత్వ కార్యాలయం ముట్టడిస్తామని హామీ హెచ్చరించారు
Admin
తెలుగు వెలుగు టీవీ