Saturday, 18 April 2026 06:12:03 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

దేశ అభివృద్ధికి శాస్త్రవేత్తలు అవసరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 08 September 2025 04:10 PM Views : 274

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దేశ అభివృద్ధి కి, ప్రజల భవిష్యత్ పురోగతికి శాస్త్రవేత్తలు అవసరం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టర్ కరకగూడెం జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల సమగ్ర పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, కిచెన్ షెడ్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్ ,మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాలను ఆయన పరిశీలిస్తూ సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. కలెక్టర్ తరగతి గదిలో విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి జీవిత లక్ష్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని తమ అభిలాషను తెలియజేయగా, కలెక్టర్ మాట్లాడుతూ వ్యక్తిగత లక్ష్యసాధనతో పాటు దేశాభివృద్ధికి తోడ్పడే దిశగా చదువుకోవడం, పరిశోధనలు చేయడం అత్యంత ముఖ్యమని సూచించారు. సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపే ఆవిష్కరణలు, పరిశోధనలు చేయగలిగే శాస్త్రవేత్తలు దేశానికి ఎంతో అవసరమని, విద్యార్థులు ఆ దిశగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

తరువాత కలెక్టర్ డైనింగ్ హాల్ పరిశీలించి అక్కడ దోమలు, ఈగలు లోపలికి ప్రవేశించకుండా మెష్ ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అలాగే కూరగాయలు, పెరుగు తదితర పదార్థాలు నిల్వ చేసుకోవడానికి ఫ్రిజ్ ఏర్పాటు చేయాలన్న సిబ్బంది అభ్యర్థనపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన, పౌష్టికాహారం తీసుకుంటూ చదువు కొనసాగించేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌గా గుర్తింపు పొందాయని, ఆ ప్రతిష్టను నిలబెట్టే విధంగా అధికారులు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచి, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు అందించాల్సిందిగా ఆయన సూచించారు. అదేవిధంగా విద్యార్థుల మానసిక, శారీరక అభివృద్ధికి అవసరమైన క్రీడా సామాగ్రి, లైబ్రరీ పుస్తకాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ పాఠశాల సిబ్బందితో సమావేశమై విద్యార్థులకు అందజేస్తున్న సదుపాయాలు, ఉన్న సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యున్నతికి, పాఠశాల అభివృద్ధి కోసం చేపట్టవలసిన పనులను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్ భాస్కరాచారి, ఉపాధ్యాయులు నయనాదేవి, చంచల్, అనిత, స్టాఫ్ నర్స్ రాధిక మరియు సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :